ఉపమాక ఆలయంలో 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Update: 2019-12-15 08:58 GMT
ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం

పాయకరావుపేట: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు వరప్రసాదాచార్యులు తెలిపారు. గరుడాద్రి పర్వతంపై గల కల్కి వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం తర్వాత గోదాదేవి దీక్షా పాశురమైన తిరుప్పావైలోని మొదటి పాశుర విన్నపం చేయడం జరుగుతుందని తెలిపారు.

ధనుర్మాసోత్సవాలు సందర్భంగా సుమారు నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం పది గంటలకు వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఒకవాహనంలోనూ, గోదాదేవి అమ్మవారిని పల్లకీలోను వేంచేపుచేసి తిరువీధి సేవలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 

Tags:    

Similar News