ఎంతవరకు సమంజసమో నిర్ణయించుకోండి.. దాడులకు చేస్తే కఠిన చర్యలు : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

దేశం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుదని, ఈ సందర్భంలో బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించడం అందరి కర్తవ్యమన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.

Update: 2020-03-27 04:58 GMT
DGP Gautam sawang

దేశం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుదని, ఈ సందర్భంలో బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించడం అందరి కర్తవ్యమన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.దేశం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుదని, ఈ సందర్భంలో బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించడం అందరి కర్తవ్యమన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ప్రజలు విషయాన్ని మరిచి పోలీసులపై దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో మీరే నిర్ణయించుకోవలని ఆయన అన్నారు.

గుంటూరు జిల్లాలోని పొందుగుల వద్ద వున్న రాష్ట్ర సరిహద్దు వద్ద జరిగిన దాడి ఘటన దురదృష్టకరమని సవాంగ్‌ తెలిపారు. ఈ సంద్భంగా పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం దేశం మొత్తం హెల్త్‌ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సవాంగ్ హెచ్చరించారు.

మెడికల్‌ ఎమర్జెన్సీతన కోసం, కుటుంబ సభ్యుల కోసం, పౌరు లంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ నేథ్యంలో అన్ని రాష్ట్రాల మధ్య సరిహద్దులు రాకపోకలు నిలివేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. కొందరు సరిహద్దులను ఛేదించుకొని, చట్టాలను ఉల్లంఘించి బైక్‌లు, కార్లు, బస్సులలో వచ్చి ప్రోటోకాల్‌ను ధిక్కరించి పొందుగుల సరిహద్దు వద్దకు చొచ్చుకొచ్చారు. అయినా మానవతా దృక్పథంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకొని వారిని వైద్య పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించే విధంగా ఒప్పందం కుదిరిందన్నారు. అందులో భాగంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవేమీ పట్టించుకోకుండా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించారు. పోలీసులపైకి దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడులకు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు హైదరాబాద్‌లో ఉంటే అక్కడే వుండాలని అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News