Andhra Pradesh: ఏపీ ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు

*పలువురు ఉద్యోగుల తీరుపై విమర్శలు *నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైనం *సీఎం ఆదేశాలు బేఖాతర్

Update: 2021-10-07 08:15 GMT

ఆంధ్రప్రదేశ్(ఫోటో- థ్ ఇహాన్స్ ఇండియా)

Andhra Pradesh: వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళన దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్న వేళా కొందరు ఉద్యోగులు, అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాల వారీగా డిప్యుటేషన్లపై ఉన్న వారి లెక్కలు తీసి తక్షణమే సొంత స్థానాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే డిప్యుటేషన్లను రద్దు చేసినా కూడా ఏదో ఒక సాకుతో జిల్లాల నుంచి వచ్చి తిష్టవేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మందికిపైగా డిప్యుటేషన్ల మీద ఉన్నారు. వీరిలో వైద్య విధులలో 54 మంది ఉన్నారు. అయితే వీళ్లంతా ఏళ్ల తరబడి విధులకే హాజరు కావటంలేదని నిర్దారణకు వచ్చింది. అటు వైద్యులతో పాటు జిల్లాల వారీగా డిప్యూటీ డైరక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వర్తించే వారంతా నిబంధనలకు విరుద్ధంగా సొంత స్థానాలను వదిలేసి డిప్యుటేషన్ పేరుతో ఏళ్లకు ఏళ్ళు పాతుకు పోయి విధులు నిర్వర్తిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 6వేల మంది ఉద్యోగులు ఇదే తరహాలో ఉన్నారని తక్షణమే వారిని ఆయా స్థానాలకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పలువరు వెళ్లిపోయారు. అయినా కొందరు మాత్రం అక్కడే తిష్ట వేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి విషయంలో చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు డిప్యుటేషన్‌పై వచ్చి హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించే వారి తీరు మరింత వివాదస్పదమవుతోంది. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు, ఇటు హైదరాబాద్ నుంచి అమరావతికి కార్యాలయాలు తరలి రాగానే సీనియార్టీ ముసుగులో అవసరం లేకున్నా డిప్యుటేషన్ అడ్డం పెట్టుకొని కొందరు ఉద్యోగులు తిష్ట వేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి మార్పులు చేర్పులు చెయ్యాలన్న కూడా వీరి ద్వారా అమలు చెయ్యాల్సి ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు మంగళగిరిలోని ఫ్యామిలీ వెల్ఫేర్, గొల్లపూడిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్, విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లలోనూ ఇలాగే ఏళ్లకు ఏళ్లుగా పాతుకుపోయారని, వీరి విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పలుకుబడితోనే వీరంతా ఇక్కడ ఉన్నారని ఆరోపణులు వెల్లువెత్తున్నాయి. సీఎం ఆదేశాలను సైతం లెక్క చేయపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటో చెప్పాలని తక్షణమే హెడ్ క్వార్ట్రర్స్, జిల్లాలోని వారి సొంత గూటికి పంపాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News