జగన్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ

Update: 2019-12-16 07:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ సందర్బంగా దిశ చట్టం తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఇలాంటి చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే దిశ చట్టం బిల్లు ప్రతిని తమకు కూడా పంపించాలని జగన్ ను ఆయన కోరారు.

కాగా దిశ చట్టం ప్రకారం ఎవరిపైనా అయినా అత్యాచార కేసు నమోదైతే దాన్ని 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి... సరైన సాక్ష్యాధారాలు ఉంటే... దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చేస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించనున్నారు. అంతేకాదు సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్ష, అలాగే లక్షల్లో జరిమానా విధించనున్నారు. ఈ బిల్లుకు గతవారం ఏపీ అసెంబ్లీలో ఆమోదం లభించడంతో.. రాష్ట్రపతి పరిశీలన, ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. 

Tags:    

Similar News