ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీకి బ్రేక్

Update: 2020-03-14 07:47 GMT
AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లపట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఒకే సారి ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయించింది.

అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ ఉగాది నాడు ఆ కార్యక్రమం ఉంటుందా లేక వాయిదా వేస్తారా అనే సందేహం మొదలైంది. అయితే, ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమం అయినా తాత్కాలికంగా నిలిపివేయాల్సిందే నని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీ నిలుపుదల చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగిసిన తరువాత అమలు చేయాలని సూచించింది. 

Tags:    

Similar News