Tirumala: తిరుమలేశుని సన్నిధిలో దీపావళి ఆస్థానం
Tirumala: హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో శ్రీవారికి ప్రత్యేక నైవేద్య నివేదన
Tirumala: తిరుమలేశుని సన్నిధిలో దీపావళి ఆస్థానం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ దీపావళి ఆస్థానం టీటీడీ నిర్వహించనుంది. దీపావళి సందర్భంగా వెంకటేశ్వరస్వామివారి సన్నిధిలో ఆస్థానపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హథీరాంజీ మఠం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక నైవేద్య నివేదనతో ఆరాధిస్తారు. శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోని సర్వభూపాల వాహనంలో ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.