Purandeswari: సోము వీర్రాజు వైఫల్యాలను పురంధేశ్వరి అధిగమిస్తారా?

Daggubati Purandeswari: ఎన్నికల ఏడాదిలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Update: 2023-07-05 07:02 GMT

Purandeswari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి

Daggubati Purandeswari: రాబోయే ఎన్నికలకు బీజేపీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో వ్యూహానికి పదును పెట్టింది. ఈ రాష్ట్రాల్లో కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు స్థానంలో సీనియర్ నాయకురాలు పురంధేశ్వరికి అవకాశమిచ్చారు. ఏపీలో ఇతర పార్టీ నుంచి పురంధేశ్వరికి పెద్దపీట వేయడం వెనుక బీజేపీ హైకమాండ్ వ్యూహమేంటన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన పురంధేశ్వరితోపాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కడంపై సీనియర్లలో అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం.

అయితే సోము వీర్రాజు వైఫల్యాల వల్లే పురంధేశ్వరికి అధ్యక్షురాలిగా అవకాశమిచ్చినట్టు చెబుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఆమె సోము వీర్రాజు వైఫల్యాలను అధిగమిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా అసంతృప్తిలో ఉన్న సీనియర్లను కలుపుకుని పోతూ ఆమె పార్టీని గాడిన పెట్టగలరా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదో ఒక పార్టీకి బీ టీమ్‌గా పడిన ముద్రను ఆమె చెరిపివేయగలరా అన్నది కూడా చూడాలి.

ఎన్నికలంటే సహజంగానే పొత్తుల వ్యవహారం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటనేదానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందని రెండు పార్టీల నుంచి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అధికార వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందా? ఆ దిశగా పొత్తులపై పురంధేశ్వరి నాయకత్వం ఎటువంటి ప్రభావం చూపనుంది? ఇక సోము వీర్రాజులా వైసీపీతో పురంధేశ్వరి ఫ్రెండ్లీగా ఉంటారా? యుద్దం చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే టీడీపీతో పొత్తు ఉండబోదన్న సంకేతాలను పురంధేశ్వరి నియామకంతో బీజేపీ హైకమాండ్ తేల్చిచెప్పిందా? చంద్రబాబుతో బీజేపీకి ఉన్న విభేదాలు పొత్తులపై ఎటువంటి ప్రభావం చూపనుంది? నారా వర్సెస్ దగ్గుబాటి కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరానికి చెక్ పడుతుందా? ఈ వైరానికి చెక్ పడి.. పొత్తుల దిశగా అడుగులు పడతాయా? జనసేనతో ఉన్న పొత్తు ముందుకు సాగుతుందా? పవన్ చెప్పిన రూట్ మ్యాప్‌కు ఇప్పటికైనా ఓ కొలిక్కి వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News