Anantapur: అనంతపురం జిల్లాలో రైతులకు కరెంట్‌ కోత కష్టాలు

Anantapur: జిల్లాలో పెద్ద ఎత్తున ఖరీఫ్‌ పంటలు సాగు

Update: 2021-10-15 12:00 GMT

అనంతపూర్ జిల్లాలో రైతులకు కరెంటు కొత్త కష్టాలు (ఫైల్ ఇమేజ్)

Anantapur: అనంతపురం జిల్లా ఉరకొండ, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లోని పల్లెల్లో విద్యుత్తు కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌లో వర్షాలు ఆశించిన మేరకు కురుస్తాయన్న నమ్మకంతో రైతులు పెద్ద ఎత్తున జిల్లాలో పంటలు సాగుచేశారు. దాదాపు జిల్లావ్యాప్తంగా అనధికారికంగా కోతలు విధిస్తూండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడు గంటల విద్యుత్తు సమయానికి రావడం లేదని ఎప్పుడు వస్తూందో తెలియడం లేదని వాపోతున్నారు.

గ్రామాల్లో రాత్రి సమయంలోనూ కోతలు విధిస్తూండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పగలు మూడు గంటలు, రాత్రి నాలుగు గంటలు నిర్దేశించిన సమయానికి రావాల్సిన సరఫరా కొంత కాలంగా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటర్లు ఆడకపోతే పంటలు పూర్తీస్థాయిలో చేతికి రావని చెబుతున్నారు. అధికారులు అనధికారికంగా విధిస్తున్న కోతలు తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

తొమ్మిది గంటల కరెంటు దేవుడెరుగు కనీసం ఆరు గంటలు నాణ్యమైన విద్యుత్తు సరపరా చేసి మోటార్లు ఆడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో కోతలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News