అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చిన మిచౌంగ్ తుఫాన్.. 2వేల హెక్టార్లలో నీట మునిగిన వరిపంట
Cyclone Michaung: తిరుపతి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చిన మిచౌంగ్ తుఫాన్.. 2వేల హెక్టార్లలో నీట మునిగిన వరిపంట
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది. తుఫాన్ దాటికి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అపార నష్టాన్ని మిగిల్చగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా పంటలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో సుమారు 2వేల హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. మరో 500 హెక్టార్లలో వేరుశెనగ, మిరప, తదితర ఉద్యానవన పంటలు నీట మునిగి రైతులు నష్టాన్ని చవి చూశారు.
కేవీబీపురం మండలం ఆరే, కలత్తూరు గ్రామాలలో చెరువులనుండి భారీగా వరద నీరు రావడంతో సుమారు 200 ఎకరాలు కోతకు గురయ్యాయి. పొలాల్లో రాళ్లు, రప్పలు వచ్చి చేరాయి. వరదయ్యపాలెం మండలంపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది .ఇక్కడ దాదాపు 21 ఒక్క గ్రామాలు జలదిగ్బంధనానికి గురై, వందల ఇండ్లు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి లెక్కలేనన్ని విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు తెలుస్తోంది.