జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు..?
పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన అంబటి రాయుడు
జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు..?
Pawan - Rayudu: జనసేనలోకి క్రికెటర్ అంబటి రాయుడు వెళ్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌కు చేరుకున్న అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. అంబటి రాయుడు గుంటూరు జిల్లా పొన్నూరు లేదా.. కృష్ణాజిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు అంబటి రాయుడు. 10 రోజుల్లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన అంబటి రాయుడు.. ఇప్పుడు జనసేనానితో భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.