కార్మికుల హక్కుల పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు

దేశంలో 70 సంవత్సరాలుగా కార్మికుల తమ హక్కుల కోసం చేసిన పోరాటం హరించుకుపోతోంది.

Update: 2019-12-17 04:49 GMT
ఏపీ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు

నెల్లూరు: దేశంలో 70 సంవత్సరాలుగా కార్మికుల తమ హక్కుల కోసం చేసిన పోరాటం హరించుకుపోతోంది. కార్మికుల హక్కులు, పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఏపీ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు పేర్కొన్నారు. నెల్లూరులో జరుగుతున్న సీఐటీయూ 50వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఆయన మీడియా తో మాట్లాడారు. రానున్న రోజుల్లో కార్మిక హక్కులకోసం పోరాటం తీవ్రతరం చేస్తామని, దీనివల్ల రాజకీయ మార్పులు వస్తాయని భావిస్తున్నామని మధు పేర్కొన్నారు.

జనవరి 8 న జరగనున్న సార్వత్రిక సమ్మెకు ఏపీ సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఏపీ లో అసంబ్లీ తీరు ప్రజల్లో అలజడి,తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందన్నారు మధు. ప్రజలు అసంబ్లీ తీరును చూసి.. తమసమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. రైతుల కు గిట్టుబాటు, నిత్యావసరాలు ధరలు నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటానికి తమపార్టీ పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు.

 

Tags:    

Similar News