కృష్ణా జిల్లాలో రెండు తలల దూడ జననం

మానవులైనా, జంతువులైనా వాటి రూపాన్నిసృష్టించింది దేవుడే. అలా పుట్టినప్పుడే వారిని కాని, వాటిని కాని మనలాంటి వారేనని భావిస్తారు..

Update: 2020-06-11 02:59 GMT
Cow has Given Birth to two headed Calf

మానవులైనా, జంతువులైనా వాటి రూపాన్నిసృష్టించింది దేవుడే. అలా పుట్టినప్పుడే వారిని కాని, వాటిని కాని మనలాంటి వారేనని భావిస్తారు.. ఆదరిస్తారు. మరి ఈ రూపానికి ఏమైంది ? దేవుడి సృష్టిలో మార్పులు.. వికృత రూపాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి ? ఇది మనుషులు, జంతువుల తప్పా.. దేవుడి శిక్షా ? కారణమేదైనా.. వికృతంగా పుడుతున్న కొంతమంది పిల్లలు, లేగ దూడలు.. 

ఒక తల.. రెండు కాళ్లు.. రెండు చేతులు.. ఉంటే మనుషులు అంటారు. ఒక తల, నాలుగు కాళ్లు ఉంటే జంతువు అంటారు.అలా కాకుండా మరి రెండు తలలు.. నాలుగు చేతులు.. ఉంటే ? అంతకు మించి కాళ్లు ఉంటే.... ఇలా పుట్టినా అందరూ అంగీకరించాల్సిందే. వాటి వాటి జాతులను బట్టి. తాజాగా కృష్ణా జిల్లాలో రెండు తలల దూడ జన్మించి, వింతగా అందరికీ ఆశ్చర్య పరిచింది.

కరోనా మాదిరిగానే వింతలు, విడ్డూరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఆవు కడుపున పంది జన్మించడం ఇలా మనం గతంలో ఎన్నడూ చూడని వింతైన అంశాలు చూస్తున్నాము. అయితే తాజాగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, రెడ్డి గూడెం మండలం, రుద్రవరం గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం గరికపాటి వెంకటేశ్వరావు ఇంటిలో నెలల నిండిన ఆవు ప్రసవించింది. అయితే తను గతం మాదిరి మరో ఆవు దూడకు జన్మనిస్తుందని ఆశగా ఎదురు చూశాడు. దానికి భిన్నంగా రెండు తలలు ఉన్న దూడకు జన్మనిచ్చింది. దీనిని పరిశీలించి చూడగా దూడకు రెండు తలలు పనిచేస్తుండటం విశేషం. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూసేందుకు తండోప తండాలుగా తరలి వస్తున్నారు.


Tags:    

Similar News