NIA Court: జగన్‌పై కోడికత్తి దాడి కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
NIA Court: నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ నిరాకరించిన NIA కోర్టు
NIA Court: జగన్‌పై కోడికత్తి దాడి కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
NIA Court: విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై కోడికత్తి దాడి కేసులో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు NIA కోర్టు శ్రీనివాస్‌కు బెయిల్ నిరాకరించింది. శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బాధితుడి స్టేట్‍మెంట్ రికార్డు చేశామని ఎన్‍ఐఏ న్యాయవాది చెప్పగా రికార్డు చేస్తే ఛార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని నిలదీశారు. ఈ నెల 31 నుంచి విచారణకు షెడ్యూల్ ప్రకటించిన కోర్టు బాధితుడు సహా మిగితా వారంతా తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించింది.