వన్ బై టూ చాయ్.. ఎంత పని చేసింది!

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 71కేసులు నమోదు అయ్యాయి.

Update: 2020-04-30 16:05 GMT
Representational Image

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 71కేసులు నమోదు అయ్యాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1403కి చేరింది. ఇందులో 1051యాక్టివ్ కేసులు ఉండగా, 321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ముఖ్యంగా ఏపీలోని కర్నూల్, గుంటూరు జిల్లాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఇక గుంటూరులోని నరసరావుపేటలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ కరోనా వ్యాప్తి మిస్టరీని ఛేదించారు పోలీసులు. అయితే లాక్ డౌన్ మొదలైనప్పుడు ఓ వ్యక్తి ఎవేమో పట్టించుకోకుండా హోటల్ ఓపెన్ చేశాడట! అక్కడ ఓ వ్యక్తి వన్ బై టూ చాయ్ తాగడమేనని తెలుస్తోంది. ఇటీవలే ఓ వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి రాగా, అతడితో కలిసి ఓ కేబుల్ ఆపరేటర్ టీ తాగాడు. అక్కడి నుంచే కరోనా వ్యాప్తి తీవ్రమైనట్టు అధికారులు గుర్తించారు.

ఆ కేబుల్ ఆపరేటర్ గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు. మరణానంతరం అతడికి కరోనా పాజిటివ్ అని గుర్తించారు. మొత్తం మీదా ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగానే ఒకరినుంచి మరొకరికి అలా పక్క గ్రామాలకు కరోనా అట్టుకుంది. ఇలా నరసరావుపేటలో కరోనా తీవ్రరూపం దాల్చినట్టు అధికారులు భావిస్తున్నారు.


Tags:    

Similar News