ఎలమంచిలి లో తొలి కరోనా కేసు.. ఢిల్లీ నుంచి వచ్చిన సైనికులు ఉద్యోగికి కరోనా పాజిటివ్

Update: 2020-06-15 04:15 GMT

కరోనా వైరస్ అక్కడ ఇక్కడ కాదు... గ్రామాలు...పల్లెలు... పట్టణాలు ... ఎక్కడైనా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఒక కేసు సైతం నమోదు కాని ప్రాంతాలకు ఈ వైరస్ సోకుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీసం జలుబు చేస్తేనే కరోనా సోకి ఉంటుందా? అనే అనుమానంతో వేధన పడుతున్నారు. విశాఖ జిల్లాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ఎలమంచిలిలో తాజాగా కరోనా కలకలం రేగింది.

ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఎలమంచిలిని కరోనా వైరస్ హడలెత్తిస్తున్నది. ఎలమంచిలి మున్సిపాలిటీ ఎలమంచిలి పట్టణానికి ఆనుకుని ఉన్న కట్టు పాలెం గ్రామానికి చెందిన ఒక సైనిక ఉద్యోగి కి కరోనా వైరస్ సోకిన టు అధికారికంగా ఆదివారం రాత్రి నిర్ధారించారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు ప్రభాతవార్త కు స్పష్టం చేశారు.కట్టు పాలెం గ్రామానికి చెందిన సుమారు 42 సంవత్సరాల వయసు కలిగిన ఒక సైనిక ఉద్యోగి ఢిల్లీలో పని చేస్తున్నాడు.

ఢిల్లీ లో పనిచేస్తున్న అతను తన తల్లి మరణించడంతో విమానంలో ఈనెల 9న విశాఖ చేరుకున్నారు.ఈ సందర్భంలో విశాఖలో విమాన ప్రయాణికులకు అదేరోజు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. పరీక్షల రిపోర్ట్ వచ్చేంత వరకు హోమ్ క్వారంటైన్ లో ఉండమని అధికారులు ఆదేశించారు. ఆదివారం సైనిక ఉద్యోగి కరోనా వైరస్ పాజిటివ్ గా రిపోర్ట్ రావడంతో ఇక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు.

అతని ద్వారా సెకండరీ కాంటాక్ట్ ఎవరెవరు ఉన్నారు అనేదానిపై సమగ్ర పరిశీలన చేస్తున్నారు. మున్సిపాలిటీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జరిపిన సర్వేలో ఇతని ద్వారా 16 మంది సెకండరీ కాంటాక్ట్ అయినట్టు గుర్తించారు. వీరందరికీ పరీక్షలో నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ఆదివారం రాత్రి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కరోనా వైరస్ సోకిన సైనిక్ ఉద్యోగిని విశాఖపట్నం గీతం ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం తరలించినట్లు అని చెప్పారు.


Tags:    

Similar News