Coronavirus: గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: గుంటూరు నగరంలో తాజాగా రెండు కొత్త కొవిడ్-19 పాజిటివ్ కేసులు సోమవారం నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి తెలిపారు.

Update: 2025-06-03 05:57 GMT

Coronavirus: గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: గుంటూరు నగరంలో తాజాగా రెండు కొత్త కొవిడ్-19 పాజిటివ్ కేసులు సోమవారం నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు తెనాలి, ఉండవల్లి ప్రాంతాల్లో కేసులు గుర్తించబడగా, ఇప్పుడు గుంటూరు నగర పరిధిలోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి.

బాధితులను వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలతో వస్తున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రి క్యాజువాల్టీ విభాగం సమీపంలో ప్రత్యేక అవుట్‌పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రోజుకి కనీసం 100 మందికి పరీక్షలు చేయగలిగేలా ఏర్పాట్లు చేశారు.

కరోనా బాధితులకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు బీ క్లాస్ వార్డులో 15 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డులో వెంటిలేటర్లతో పాటు ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడా సిద్ధం చేశారు.

Tags:    

Similar News