కరోనా పరీక్షల్లో ఉదయం పాజిటివ్.. తర్వాత నెగటివ్

నెల్లూరు జిల్లాలో రోజురోజుకూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

Update: 2020-04-05 05:52 GMT
Representational Image

నెల్లూరు జిల్లాలో రోజురోజుకూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోనూ అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఈనెల 3వ తేదీన వచ్చిన కరోనా రిపోర్ట్ విషయం మరింత ఆందోళన కు గురిచేస్తుంది. ఆ వ్యక్తికి మొదట పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఆరోజే మళ్లీ వచ్చిన నివేదికలో నెగెటివ్‌ అని వచ్చింది. దీంతో అధికారులను గందరగోళానికి దారితీసింది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

దీనిపై నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అదనపు ఆర్‌ఎంవో డాక్టర్‌ కనకాద్రిని వివరణ కోరగా.. ఆ వ్యక్తికి కరోనా వైరస్ నెగెటివ్‌ అని తెలిపారు. టెక్నికల్‌ సమస్య వలన తొలుత పాజిటివ్‌గా నమోదైందని, వెంటనే మళ్లీ దానిని నిర్ధారించి నెగెటివ్‌గా గుర్తించి రిపోర్ట్ పంపారని వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన నివేదికలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి.




Tags:    

Similar News