గుంటూరులో 94 పాజిటివ్ కేసులు.. ఏపీలో తాజా బులిటెన్ విడుద‌ల‌

ఏపీలో క‌రోనా కేసులు పెరిగిపోయాయి. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో 439 పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.

Update: 2020-04-13 14:23 GMT
Representational Image

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439కు చేరుకుంది. తాజా బులిటెన్‌లో ప్రకారం రాష్ట్రంలో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జల్లాలో మూడు కేసులు నమోదు కాగా.. గుంటూరు జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇవాళ ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏకంగా 11 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 3, చిత్తూరులో 2, కృష్ణాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 నమోదయ్యాయి. ఇప్పటి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని 12మంది డిశ్చార్జి అయ్యారు. ఏడుగురు ఈ మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా మృత్యువాత‌ప‌డ్డారు

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు సంఖ్య చూస్తే..

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 93 కేసులు నమోదయ్యాయి. కర్నూలు 84, నెల్లూరు 55, ప్రకాశం జిల్లా 41, చిత్తూరు 23, కడప 31, అనంతపురం 15, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరి 23, కృష్ణాజిల్లా 36, విశాఖపట్నం 20, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతానికి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విశాఖపట్నం జిల్లాలో కూడా గత నాలుగు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 

Tags:    

Similar News