కరోనా టెస్టులు పూర్తయ్యాకే కాపురానికి రావాలన్న భార్య.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఈ మహమ్మారి పాకేసింది.

Update: 2020-03-29 06:46 GMT
Representational Image

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఈ మహమ్మారి పాకేసింది. కరోనా నుంచి బయటపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకున్నాయి. కరోనా వైరస్‌పై రోజురోజూకీ అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వైరస్ పట్ల చైతన్యవంతులవుతున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ గృహిణి తన భర్తకు షరతు పెట్టింది. కరోనా పరీక్షలన్నీ పూర్తయ్యాకే కాపురం చేయాలంటూ కండీషన్ పెట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణి భర్త.. తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఆమె భర్త సొంత గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చాడు. దీంతో అతడి భార్య కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత కలిసి ఉండాలని భార్య భర్తకు తేల్చిచప్పేసింది. కరోనా పరీక్షలు లేకపోతే ఈ వైరస్ పిల్లలకు సోకే ప్రమాదం ఉందని భర్తకు వివరించింది. అయినా భర్త అమె మాటలు పెడచేవిన పెట్టాడు. వైద్య పరీక్షలు చేయించుకోలేదు. ఈ విషయమై.. ఇద్దరు గొడవపడ్డారు. దీంతో సదరు గృహిణి శనివారం ఆదోని పట్టణ పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరినీ ఆదోని ఆస్పత్రికి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.


Tags:    

Similar News