ఏపీలో ఒక్కరోజే ఐదు కరోనా మరణాలు.. భారీగా పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే కరోనా కేసులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో కర్నూలు 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురం ఒక కేసు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి బారినపడి ఇవాళ ఐదుగురు మరణించారు. దీంతో కరోనా వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. మరో 20 మంది బాధితులు డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం 491 మంది చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 చొప్పున ప్రాణాలు విడిచారు. అనంతపురం (2), కర్నూలు (2), నెల్లూరు (2) మృత్యువాతపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 5 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన 23 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 525కి పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఏపీలో పది జిల్లాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జాబితాను కేంద్ర ప్రకటించింది. ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలుగా.. కర్నూలు, గుంటూరు, కృష్ణ, కడప, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపూరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రంలో జిలాల వారిగా పాజిటివ్ కేసులు పరిశీలిస్తే
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదయ్యాయి, కర్నూలు (110), కృష్ణ(45), కడప(36), నెల్లూరు(58), ప్రకాశం(42), పశ్చిమ గోదావరి(31), చిత్తూరు(23), అనంతపూరం(21), విశాఖపట్నం(20), తూర్పు గోదావరి(17) జిల్లాలు ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి