కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ టాప్.. రికవరిలోనూ ముందంజే

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రారంబంలో తడబడినట్టు అనిపించినా రెండు, మూడు వారాలు గడిచే సరికి సర్ధుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళుతోంది.

Update: 2020-06-03 08:11 GMT

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రారంబంలో తడబడినట్టు అనిపించినా రెండు, మూడు వారాలు గడిచే సరికి సర్ధుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళుతోంది. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలను ఒక్కసారే పంచడమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు అవసరమైన కిట్లు సమకూర్చుకుంది. ఈ తరుణంలో డివిజన్ స్థాయిలో టెస్టులు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ స్థాయిలో టెస్టులు నిర్వహించారు. దీంతో వ్యాధి నిర్ధారణ విషయంలో ఒక అడుగు ముందుకే ఉన్నారు. దీంతో పాటు వ్యాధిగ్రస్తుల రికవరీలో సైతం ఏపీ ముందంజలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశ రికవరీ రేటు 48 శాతం ఉండగా, ఏపీలో 69 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డును క్రియేట్ చేసింది. ప్రతీ రోజూ 12 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు పరీక్షల నిర్వహణతో పాటుగా జిల్లాల వారీగా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలన్నీ అందిస్తున్నట్లు ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా పరీక్షలు 3 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏపీలో 3,95,681 పరీక్షలు జరగ్గా.. 3,91,890 కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కాగా, రికవరీ రేటు విషయంలో కూడా ఏపీ గణాంకాలు భేష్‌గా ఉన్నాయని చెప్పాలి.

కరోనా కేసుల్లో దేశ రికవరీ రేటు 48 శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 45 శాతం ఉంది. అయితే ఏపీ మాత్రం చాలా మెరుగ్గా 69 శాతం రికవరీ రేటు ఉందని ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ తెలిపారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 3,200 నమోదు కాగా, అందులో యాక్టివ్ కేసులు 927 ఉన్నాయి. ఇక 2209 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 64 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Tags:    

Similar News