Coronavirus cases in AP: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 8 కొత్త కేసులు నమోదు

Coronavirus cases in Andhra Pradesh: రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురికి, ఏలూరులో ఇద్దరికి, అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరికి పాజిటివ్ అని తేలింది.

Update: 2025-06-11 01:00 GMT

గుంటూరు: గత వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో నలుగురు గర్భిణులు ఉండటం మరింత కలవరపెడుతోంది. గుంటూరు వైద్య కళాశాలలోని ల్యాబ్‌లో 58 నమూనాలను పరీక్షించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల నుంచే ఎక్కువ నమూనాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఏలూరు: కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన 8 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఒకరు 53 ఏళ్ల పురుషుడు, మరొకరు 28 ఏళ్ల మహిళ. వీళ్లిద్దరూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 9కి చేరింది.

అనంతపురం: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 5కి చేరింది.

నెల్లూరు: తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన 21 ఏళ్ల యువకుడికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News