కరోనా ఎఫెక్ట్ : కరోనా కుమారి, కరోనా కుమార్.. పిల్లలకు ఇంట్రెస్టింగ్ పేర్లు

కరోనా వైరస్ ... ఇప్పుడు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపేరు వింటేనే జనాలు గజగజవణికిపోతున్నారు.

Update: 2020-04-07 09:43 GMT
Representational Image

కరోనా వైరస్ ... ఇప్పుడు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపేరు వింటేనే జనాలు గజగజవణికిపోతున్నారు. కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలకి మాత్రం ఇదే పేర్లుగా మారుతుంది. తాజాగా ఛత్తీస్ ఘడ్ లో కవల పిల్లలు పుడితే అమ్మాయికి కరోనా..అబ్బాయికి కోవిడ్ అనే పేర్లు పెట్టారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లోని కడపలో చోటు చేసుకుంది.

కడప జిల్లా వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళలకు పురిటి నొప్పులు రావడంతో వారి కుటుంబ సభ్యులు ప్రసవం కోసం వేంపల్లెలోని గండిరోడ్డులో ఉన్న బాషా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం వారికి సర్జరీ చేసి పురుడుపోశారు. ఈ సమయంలో ఒకరికి కుమారుడు మరొకరికి కూతురు జన్మించారు. అయితే పాపకు కరోనా కుమారి, బాబుకు కరోనా కుమార్‌ అనే పేర్లు పెట్టాలని డాక్టర్లు ప్రతిపాదించడంతో దానికి బిడ్డల తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. దీనితో ఇలా పిల్లలకి వెరైటీ పేర్లు పెట్టారు.

ఇక ఏపీలో కరోనా వైరస్ విషయానికి వచ్చేసరికి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.


Tags:    

Similar News