ఏపీలో అక్కడ మాత్రం చికెన్ చాలా చీప్!

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కరోనా ధాటికి అన్ని రంగాలు కుదేలైపోయాయి.

Update: 2020-03-11 14:24 GMT
చికెన్ షాపు ఏపీ

 కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కరోనా ధాటికి అన్ని రంగాలు కుదేలైపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం కుప్పకూలిపోయాయి. ఇక మన దేశంలో సైతం కోవిడ్ విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కేసులు 60పైగా నమోదైయ్యాయి. కరోనా ప్రభావంతో దేశంలోని మాంసం విక్రేతలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజలు మాంసం తీనాలంటేనే భయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా మాంసం అమ్మకాలపై ప్రభావం పడింది. తెలంగాణ కరోనా వైరస్ కేసు నమోదు తర్వాత మాంసం విక్రయాలు పడిపోయాయి. ఇక ఏపీలో చూస్తే శ్రీకాకుళం జిల్లాలో చేపలు, రోయ్యలు వంటి మాంసం విక్రయాలు పడిపోయాయి. రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు నమోదైన నేపథ్యంలో దీని ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. చికెన్ ధర మరింత పతనమై కిలో కేవలం 40 రూపాయలు మాత్రమే పలుకుతోంది. చికెన్ తినడం వల్ల కరోనా వంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నా, ప్రజలు తినడం మానేశారు. వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.

అసలు ఉన్న కోడి అమ్ముడు పోతే చాలు అనుకునే స్థాయికి వచ్చారు. దీంతో మాంసం ధరలు భారీగా తగ్గించారు. కర్నూలు జిల్లా గూడూరులో ఓ దుకాణ యజమాని కిలో కోడి మాంసాన్ని40 రూపాయలకే అంటూ బోర్డు పెట్టారు. కర్నూలు జిల్లాలో చాలా చోట్ల వ్యాపారులు ధరలను భారీగా తగ్గించి విక్రయిస్తున్నారు. నష్టాలు వస్తున్న చేసేది ఏమీ లేక ఇలా అమ్ముతున్నామని పలువురు వాపోతున్నారు.


Tags:    

Similar News