YS Jagan: జగన్ సర్కార్ చొరవ.. సొంతూళ్లకు విద్యార్థులు
తెలుగు విద్యార్థులు ఉన్నతచదువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి కరోనా మహమ్మారి కారణంగా చిక్కుకున్న విషయం తెలిసిందే.
తెలుగు విద్యార్థులు ఉన్నతచదువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి కరోనా మహమ్మారి కారణంగా చిక్కుకున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో చాలా మంది విద్యార్థులు చిక్కుకున్నారు. లాక్‌డౌన్ విధించగానే ఢిల్లీ నుంచి విద్యార్థులు ఆంధ్రకు బయలుదేరారు. అయితే, వాళ్లను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అడ్డుకున్నారు.
తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే ఉంచేశారు. దీంతో ఆంధ్రా విద్యార్థుల దుస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో... జగన్ సర్కార్ అప్రమత్తమైంది. వారిని సొంతూళ్లకు చేర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. దీంతో.. ఆ విద్యార్థులంతా ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు వెళ్లనున్నారు.
ఇక ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులు కూడా త్వరలోనే విశాఖకు చేరుకోకున్నారు. ప్రత్యేక విమానంలో విద్యార్థులు స్వదేశానికి రానున్నారు. చాలా రోజులుగా ఇటలీ విమానాశ్రయంలో విద్యార్థులు నానా కష్టాలు పడ్డారు. దీంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి ప్రత్యేక విమానంలో వారిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నారు.