Coronavirus Effect: ఈరోజు ఏపీ హైకోర్టు కార్యాకలాపాలు రద్దు.. కరోనా నేపథ్యంలో చర్యలు

Coronavirus Effect: అన్ని ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2020-07-01 03:00 GMT

Coronavirus Effect: అన్ని ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా బుధవారం కోర్టుకు సంబంధించిన అన్ని కార్యాకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించారు.

కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. వారు వీరు అని తేడా లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కొవిడ్ సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు.

చీఫ్‌ జస్టీస్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర పిటిషన్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ ఉధృతి మాత్రం తగ్గడం లేదు. టెస్టులు చేసే కొలదీ పాజిటివ్ రిపోర్టులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో హైకోర్ట్ సిబ్బందికి కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. దీంతో ఒకరోజు కార్యకలాపాలను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News