హోలీకి కరోనా ఎఫెక్ట్‌.. పెద్దగా స్పందించని తెలుగు రాష్ట్రాల ప్రజలు

Update: 2020-03-09 08:55 GMT
హోలీకి కరోనా ఎఫెక్ట్‌.. పెద్దగా స్పందించని తెలుగు రాష్ట్రాల ప్రజలు

కరోనా ఎఫెక్ట్‌ హోలీ సంబరాలపై కొట్టిచ్చినట్లు కన్పించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో హోలీ సంబరాలు అంతంత మాత్రంగానే జరిగాయి. విశ్వహిందూ పరిషత్‌, అధికారులు కూడా హోలీకి దూరంగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌లోని పలు కాలనీల్లో మాత్రం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. యువకులు కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్నారు.

కరోనా వైరస్‌ దెబ్బకు జనాలు భయాందోళనకు గురవుతున్నారు. హోలీ జరుపుకోవడానికి ప్రజలు వణుకుతున్నారు. హోలీ సంబరాలతో మారుమ్రోగాల్సిన ప్రాంతాలు సంబరాలు లేక ఉమ్మడి ఆదిలాబాద్‌లో బోసిపోతున్నాయి.

కరోనా ప్రభావంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో హోలీ వేడుకలు బోసిపోయాయి. కరోనా ప్రభావంతో ప్రముఖులు హోలీ వేడుకలు రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో ఆ ప్రభావం పండగపై కన్పించింది. రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారాయి. సిద్ధిపేటలో మాత్రం మంత్రి హరీష్‌రావు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సంగారెడ్డిలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించే జగ్గారెడ్డి ఈసారి హోలీ వేడుకలకు దూరంగా ఉన్నారు.

కరోనా ఎఫెక్ట్‌తో విశాఖ సాగరతీరం బోసిపోయింది. హోలీ రోజున వేలాది మందితో కిటకిటలాడే ఆర్కే బీచ్‌ ఖాళీగా దర్శనమిస్తోంది.

Tags:    

Similar News