శ్రీశైలం మహాశివరాత్రి ఉత్సవాలపై సమన్వయ సమావేశం
Srisailam: ఫిబ్రవరి 7 నుంచి 21 తేదీ దాకా జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీశైలం మహాశివరాత్రి ఉత్సవాలపై సమన్వయ సమావేశం
Srisailam: శ్రీశైలంలో జరిగి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు శ్రీశైలంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 7 నుంచి 21 తేదీ దాకా జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఏర్పాట్లు, సమన్వయ సహకారంపై జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమీక్షించారు. మహాశివరాత్రికి వచ్చే భక్తుల రద్ధీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. శ్రీశైలంకు చుట్టుపక్కలున్న కర్నూలు, నంద్యాల,ప్రకాశం, గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు, వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ చర్యలను బాధ్యతాయుతంగా చేపట్టాలని నిర్ణయించారు.