TTD: శరవేగంగా తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు

TTD: నవంబర్‌ నాటికి ఆస్పత్రిని పూర్తి చేస్తామని ప్రకటన

Update: 2023-06-27 14:28 GMT

TTD: శరవేగంగా తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు 

TTD EO Dharma Reddy: టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని...టీటీడీ ఈవో తెలిపారు. తిరుపతిలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి పనులను ధర్మారెడ్డి పరిశీలించారు. ఆస్పత్రి భవన నిర్మాణంపై టీటీడీ అధికారులకు ఈవో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి ఈ ఆస్పత్రిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ హృదయాలయం ఆసుపత్రిలో ఇప్పటి వరకు 14వందల 50 గుండె ఆపరేషన్లు నిర్వహించి పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించినట్లు చెప్పారు. 

Tags:    

Similar News