శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళపేటలో గందరగోళం
* ఓటర్ లిస్టులో కొత్త పేర్లు నమోదు * 196 పేర్లను చేర్చిన అధికారులు * టీడీపీ నేతల అభ్యంతరం
Representational Image
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో గందరగోళం నెలకొంది. ఓటర్ లిస్టులో కొత్త పేర్లు నమోదు చేయడంపై గ్రామస్తులు మండిపడ్డారు. 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉండగా కొత్తగా అధికారులు 196 ఓట్లు చేర్చారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ మద్దతుదారులను గెలిపించుకోవటానికే లిస్టులో కొత్త పేర్లు నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.