Vizag Steel Plant: జనసేన నేతలు, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం
పవన్‌ను గాజువాకలో ఓడించినప్పుడు దీక్షకు ఎందుకొస్తారన్న జనసేన నేతలు వైసీపీ నుంచి గెలిచిన లీడర్ ఏం చేశారన్న నేతలు
Vizag Steel Plant
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో జనసేన నాయకులు, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా స్టీల్ నిరవధిక దీక్షకు గాజువాక జనసేన నేత కోణతాతారావు సంఘీభావం తెలిపారు. అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనసేనాని వైఖరి తెలిపాలిపి దీక్షకు రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, పవన్ కళ్యాణ్‌ను గాజువాకలో ఓడించినప్పుడు దీక్షకు ఎలా వస్తారని జనసేన నాయకులు ప్రశ్నించారు. అంతేకాకుండా స్థానికంగా గెలిచిన వైసీపీ నాయకుడు ఏం చేశారని ప్రశ్నించారు. జనసేనాని ఆదేశాల మేరకే సంఘీభావం తెలిపామన్న జనసేన నేతలు అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగారు.