Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతం

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన * స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ

Sandeep Eggoju
Published on: 10 July 2021 1:41 PM IST
Visakhapatnam Steel Plant Protest Against Privatization
X

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతమైంది. ప్లాంట్‌ అమ్మకానికి సంబంధించి సలహాదారుల నియామకం కోసం.. తాజాగా కేంద్రం ప్రకటన విడుదల చేసింది. దీంతో.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనలను విస్తృతం చేసింది. స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ నుంచి గాంధీ విగ్రహం వరకు బైకు ర్యాలీ చేపట్టింది. ఓల్డ్‌ గాజువాక, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో ఉద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం దగ్గర భారీ బహిరంగ సభ జరగనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story