విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు

* విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

Update: 2021-02-12 06:38 GMT

Representational Image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగర తీరంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ దగ్గర రిలే నిరాహారదీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాలతో స్టీల్‌ ప్లాంట్‌ మార్మోగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కానివ్వమని, కేంద్రం ప్రకటించిన స్ట్రాటజిక్‌ సేల్‌ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పోరాట కమిటీ సభ్యులు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్‌ను, 32వేల మంది నిరాహారదీక్షలు చేసి కాపాడుకుంటామని అంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ వద్ద రిలే నిరాహారదీక్షలో సీపీఐ నారాయణ పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షకు సంఘీభావం ప్రకటించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు.

Tags:    

Similar News