ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ఉత్కంఠ

AP Employees: కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల దీక్షలు, డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలంటున్న ఉద్యోగులు.

Update: 2022-01-28 03:24 GMT

ఏపీలో ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ఉత్కంఠ

AP Employees: ఒకటో తారీఖు సమీపిస్తున్నవేళ ఏపీలో ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ నెలకొంది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల రిలే దీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి. తాము అడిగిన ఫిట్ మెంట్ సర్కార్‌ ఇవ్వలేదంటున్న ఉద్యోగులు.. పాత జీతాలు కావాలని పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం తాము పెంచిన ఫిట్ మెంట్ ప్రకారమే కొత్త జీతాలు ఇస్తామంటోంది. మరోవైపు ఈ సాయంత్రానికల్లా బిల్లులు పెట్టాలని నిన్న సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్, మున్సిపల్ ఉద్యోగుల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేస్తున్నారు. అటు ఉద్యోగులు మాత్రం డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలంటూ, చర్యలు తీసుకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News