నేడు ఇడుపులపాయకు సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్.. ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్‌ఆర్‌ పదో వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పులివెందుల, ఇడుపులపాయకు రానున్న సీఎం.. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

Update: 2019-09-02 03:37 GMT

ఏపీ సీఎం జగన్.. ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్‌ఆర్‌ పదో వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పులివెందుల, ఇడుపులపాయకు రానున్న సీఎం.. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. జగన్‌ కడప జిల్లా పర్యటన కోసం.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకరోజు పర్యటన కోసం.. ముఖ్యమంత్రి జగన్‌.. ఇవాళ కడప జిల్లాకు రానున్నారు. ఈ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి.. వైఎస్‌ఆర్ ఘాట్ దగ్గర నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తన తండ్రికి ఘన నివాళులు అర్పించనున్న జగన్‌.. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

ఆ తర్వాత జగన్‌ పులివెందులకు చేరుకుంటారు. అక్కడ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి నివాసం దగ్గర ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం ఆర్‌ అండ్ బీ గెస్ట్‌ హౌజ్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై స్థానిక నాయకులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రస్తుత బడ్జెట్‌లో పులివెందుల అభివృద్ది కోసం పులివెందుల అభివృద్ధి సంస్థ.. పాడాకు 100 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి.. జగన్‌ అధికారుకుల దిశానిర్దేశం చేస్తారు. మండలాల వారీగా అభివృద్ధి పనుల జాబితాను పరిశీలిస్తారు. అలాగే కరువు మండలమైన చక్రాయపేటకు కృష్ణా జలాల తరలింపు పథకాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది. కడప జిల్లా పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అభిషేక్‌ మహంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

Tags:    

Similar News