ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై జగన్ సీరియస్.. రేపు సస్పెండ్ చేస్తారా?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయం రేపు(మంగళవారం) తీసుకుంటారని పార్టీ వర్గాలు దృవీకరిస్తున్నాయి.

Update: 2020-06-15 14:05 GMT
andhra pradesh cm ys jaganmohanreddy (file photo)

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయం రేపు(మంగళవారం) తీసుకుంటారని పార్టీ వర్గాలు దృవీకరిస్తున్నాయి. రఘురామ కృష్ణంరాజు గతకొన్ని రోజులుగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారనే చర్చ ఉంది. ఒకవైపు సీఎం జగన్ పరిపాలన బాగుందంటూనే మరోవైపు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు..

అంతేకాదు పదే పదే ఢిల్లీలో వైసీపీ అనుమతి లేకుండా వ్యవహారాలను చక్కబెట్టడం వంటి విషయాలపై జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ సోషల్ మీడియా కూడా విరుచుకు పడుతోంది. అయితే ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ చేయించుకోవాలని.. తద్వారా బీజేపీలో చేరాలనే ఇలా చేస్తున్నారని కొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రేపు ఆయనపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. 

Tags:    

Similar News