పేదల ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇలాంటి ప్రతిపక్షాన్నీ ఎక్కడా చూడలేదు : సీఎం జగన్

Update: 2020-05-30 11:13 GMT

ప్రభుత్వంలో లంచాలనే మాట లేకుండా నేరుగా ప్రజల ఖాతాలోనే డబ్బును జమ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా శనివారం 'వైఎస్సార్‌ రైతు భరోసా' కేంద్రాలను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

ఇళ్లులేని పేదలకు భూ పట్టాల పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షం కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సంకల్పించిన పథకాలను అమలు కాకుండా అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని సీఎం మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. లంచం, అధికార పార్టీ సిఫార్సు లేనిదే గత ప్రభుత్వంలో పేదవాడికి పని జరిగేది కాదని గుర్తుచేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నామని జగన్ అన్నారు. దరఖాస్తు నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అన్ని జాబితాలను గ్రామ సచివాలయాల్లో పెడుతున్నామని సీఎం జగన్‌ వివరించారు. 

Tags:    

Similar News