వైసీపీ కార్యాలయంలో సిఎం జగన్ జన్మదిన వేడుకలు

మండలం అడ్డురోడ్ లో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

Update: 2019-12-21 08:48 GMT
ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

ఎస్.రాయవరం: మండలం అడ్డురోడ్ లో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది మనమంతా ఇదే విధంగా జగన్ జన్మదిన వేడుకలు చేసుకోవాలని తెలిపారు.

పేద ప్రజల అభివృధ్ధికి గొప్ప సంక్షేమ పథకాల్ని జగన్ ప్రవేశ పెడుతున్నారని, వాటిని ప్రజలందరికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలియజేయడం ద్వారా ముఖ్యమంత్రికి అందరూ బాసటగా నిలవాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మనమంతా ఘన విజయంకి కృషి చేయాలన్నారు. విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయతలపెట్టడం ఈ జిల్లా అభివృధ్ధికి దోహదపడుతుందన్నారు.

Tags:    

Similar News