కియాలో 75 శాతం మనవాళ్లే..

Update: 2019-12-05 02:49 GMT

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్రమంచి గ్రామంలో కియా మోటార్స్ ఇండియా ఫ్యాక్టరీ తయారీ విభాగాన్ని గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 11.05 గంటలకు పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా మోటర్స్‌ కంపెనీకి వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 12.35 గంటల వరకు ప్లాంట్‌ టూర్‌లో భాగంగా పరిపాలన విభాగం, ప్రెస్, బాడీ, పైయింట్, అసెంబ్లీంగ్, ఇంజన్‌ షాప్‌లను, టెస్ట్‌ డ్రైవర్‌ను సందర్శిస్తారు. అనంతరం ఓపెనింగ్‌ సెర్మనీలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

పారిశ్రామికీకరణతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం మరియు ఉద్యోగాలలో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించడం అనే విధానాన్ని ఈ ప్రాజెక్టు ద్వారానే ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. కియా లో మొత్తం 12,835 మంది కార్మికులను నియమిస్తే.. వీరిలో 10,887 మంది మన రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. అంతేకాకుండా వీరిలో 7029 మంది అనంతపురం జిల్లాకు చెందినవారు ఉన్నారు. వీరికి 100% శిక్షణ ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. 

Tags:    

Similar News