Jagan: నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

Jagan: కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ వద్ద .. రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్

Update: 2024-03-12 03:45 GMT

Jagan: నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

Jagan: సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకు అందజేస్తారు. రిటైనింగ్ వాల్స్ పూర్తి కావడంతో కృష్ణలంక వాసుల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

యుద్ధప్రాతిపదికన 2.26 కిలోమీటర్ల మేర ఫేజ్- 2, ఫేజ్-3 రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2వ దశలో 134.43 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తి అయ్యింది. కోటి నగర్ నుంచి కనకదుర్గ వారధి వరకూ రిటైనింగ్ వాల్ నిర్మించారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్ పద్ధతిలో పునాదులు వేశారు. 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించారు. 3వ దశలో 235.46 కోట్లతో 1.06 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు. కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకూ రిటైనింగ్ వాల్ నిర్మించారు.

Tags:    

Similar News