నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు
నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: నేడు పల్నాడు జిల్లా వినుకొండలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం సీఎం జగన్ కానుక అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 30వేల 145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల ఖాతాల్లో 330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి జమ చేయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండ చేరుకుంటారు. వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం వారితో, స్థానిక నేతలతో కొద్ది సేపు మాట్లాడి, తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తుంది. ఈ లెక్కన మూడేళ్లలో ఈ పథకం ద్వారా మొత్తం సాయం 927.39 కోట్లు.