CM Jagan: రేపు ప్రకాశం జిల్లా మర్కాపురంలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
CM Jagan: రేపు ప్రకాశం జిల్లా మర్కాపురంలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9 గంటల 55 నిమిషాలకు మార్కాపురం చేరుకుంటారు.
ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 12 గంటల 40 నిమిషాలకు అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.