CM Jagan: కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండోరోజు పర్యటన

CM Jagan: పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న సీఎం

Update: 2021-12-24 10:52 GMT

కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండోరోజు పర్యటన

CM Jagan: కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందులకు మంచి కంపెనీ వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. 110 కోట్లతో ఆదిత్య బిర్లా కంపెనీ టెక్స్ టైల్స్ పరిశ్రమ వస్తోందని తెలిపారు. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఒకటని వివరించారు. పులివెందులలో ఆదిత్య బిర్లా కంపెనీ ఏర్పాటు ద్వారా తొలిదశలో 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 

Tags:    

Similar News