CM Jagan: జనవరి 1 నుంచి పెంచిన రూ.3వేల పెన్షన్ అమలు

CM Jagan: ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఎంత కష్టపడ్డామో అందరికీ తెలిసిందే

Update: 2023-12-28 11:27 GMT

CM Jagan: జనవరి 1 నుంచి పెంచిన రూ.3వేల పెన్షన్ అమలు

CM Jagan: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్‌సమీక్ష నిర్వహించారు. డియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో మూడు, ఫిబ్రవరిలో ఒకటి, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌ లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయన్నారు. జనవరి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని కీలక ప్రకటన చేసారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు.

Tags:    

Similar News