Disha Police Stationను ప్రారంభించనున్న సీఎం

మహిళల రక్షణ దిశగా ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేస్తోంది.

Update: 2020-02-08 03:46 GMT
jagan File Photo

మహిళల రక్షణ దిశగా ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ సీఎం జగన్‌ పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి... మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. వీటన్నింటినీ జగన్... రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు. అదేవిధంగా దిశ కేసులనుయ వేగవంతంగా దర్యాప్తుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేయనున్నారు.

  అసెంబ్లీలో ఆమోదం పొందిన దిశా చట్టం కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. కేంద్రం ఈ చట్టంలోని కొన్ని అంశాలపై వివరణ కోరడంతో... రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాల్ని కూడా కేంద్రానికి పంపింది . రాష్ట్రంలో ఈ చట్టం అమల్లోకి వస్తే అత్యాచార కేసుల్లో 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి దోషులకు శిక్ష అమలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.

మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. దిశ యాప్ కూడా ప్రవేశపెడుతున్నట్లు సుచరిత తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌‌ను ప్రారంభించిన అనంతరం నన్నయ యూనివర్శిటీకి వెళ్తారు. అక్కడ దిశ వర్క్‌షాప్‌‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దిశ పోలీస్ ఎందుకు తేవాల్సి వస్తోందో సీఎం జగన్ వివరిస్తారు.


Tags:    

Similar News