CM Jagan: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సమీక్ష..
CM Jagan: మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో వెళ్లనున్న ఐఏఎస్‌ల బృందం
CM Jagan: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సమీక్ష..
CM Jagan: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో ఘటనా స్థలానికి ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపాలని ఆదేశించారు. సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి.. అవసరమైతే అంబులెన్స్‌లు పంపించేందుకు అక్కడి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బాధితులకు ఎమర్జెన్సీ సేవలు అవసరమైతే విశాఖపట్నం సహా సరిహద్దు జిల్లాల్లోని ఆస్పత్రులను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని.. ఎప్పటికప్పుడు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తనకు తెలపాలని ఆదేశించారు సీఎం జగన్.