నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంపై సీఎం జగన్ సమీక్ష
Navaratnalu: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంపై సీఎం జగన్ సమీక్ష
Navaratnalu: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. ఇళ్ళ నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీలో వసతులు, టిడ్కో ఇళ్లపై జరిగిన ఈ సమీక్షలో ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ప్రస్తుతం 3.03 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. జులై 10 నాటికి మరో 7లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నట్లు సీఎంకు వెల్లడించారు. అనంతరం, ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను శరవేగంగా పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వారం రోజుల్లో అన్ని లేఅవుట్లలో పనులు పూర్తి కావాలన్నారు.