CM Jagan: ముగిసిన సీఎం జగన్‌ పోలవరం పర్యటన

CM Jagan: హిల్‌వ్యూ నుంచి ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన * ఆర్‌అండ్‌ఆర్‌ నిర్వాసితులతో మాట్లాడిన సీఎం

Update: 2021-07-19 08:51 GMT

పోలవరంలో ముగిసిన జగన్ పర్యటన

CM Jagan: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన ముగిసింది. ప్రాజెక్ట్‌ పనులను సీఎం హిల్‌వ్యూ ద్వారా పరిశీలించారు. అలాగే స్పిల్‌వే పైకి వెళ్లి పనులను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు జగన్‌కు వివరించారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్షించారు. స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయని అధికారులు వివరించారు. 48 గేట్లలో 42 గేట్లు పూర్తయ్యాయని మిగిలిన గేట్లను త్వరలో బిగిస్తామన్నారు.

2023 ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 2022 జూన్‌ కల్లా టన్నెల్‌ పనులు, లైనింగ్‌ పనులు పూర్తికావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అయితే డిసెంబర్‌కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన ముగిసింది. ప్రాజెక్ట్‌ పనులను సీఎం హిల్‌వ్యూ ద్వారా పరిశీలించారు. అలాగే స్పిల్‌వే పైకి వెళ్లి పనులను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు జగన్‌కు వివరించారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్షించారు. స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయని అధికారులు వివరించారు. 48 గేట్లలో 42 గేట్లు పూర్తయ్యాయని మిగిలిన గేట్లను త్వరలో బిగిస్తామన్నారు.

2023 ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 2022 జూన్‌ కల్లా టన్నెల్‌ పనులు, లైనింగ్‌ పనులు పూర్తికావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అయితే డిసెంబర్‌కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. 

Tags:    

Similar News