మీ అత్తగారికి కూడా పదవిచ్చాం: చంద్రబాబుతో సీఎం జగన్
నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. నామినేటెడ్ పదవుల అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తారు.
నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. నామినేటెడ్ పదవుల అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తారు. దీనిపై నేరుగా సీఎం జగనే స్పందించారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు.మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ పదవులు గతంలో రాజకీయ పలుకుబడి ఉన్న ఓసీ వర్గానికి మాత్రమే వచ్చేవని.. కానీ తాము తెచ్చిన చట్టాల వల్ల కృష్ణాజిల్లాలో 19 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఉంటే అందులో పది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని ప్రస్తావించారు. ఇక తెలుగు అకాడమీ చైర్మన్‌గా చంద్రబాబు అత్తగారైన లక్ష్మీపార్వతిని నియమించామని జగన్ సెటైర్ వేశారు. ఆమెకు పదవిని మీరివ్వలేకపోయారని, మేం ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వివిధ పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాను అసెంబ్లీలో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. అందులో..
వాసిరెడ్డి పద్మ: ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్
లక్ష్మీపార్వతి : చైర్‌పర్సన్, ఏపీ తెలుగు అకాడమీ
జస్టిస్ ఏ శంకర్‌నారాయణ: చైర్మన్, ఏపీ శాశ్వత బీసీ కమిషన్
జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ : చైర్మన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మనిటరింగ్ కమిషన్
భార్గవరాం : వైస్ చైర్మన్, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మనిటరింగ్ కమిషన్
జక్కంపూడి రాజా : చైర్మన్, కాపు కార్పొరేషన్
ఆర్కే రోజా : చైర్‌పర్సన్, ఏపీఐఐసీ
ప్రముఖ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి: చైర్మన్, ఏపీ స్టేట్ మెడ్ అండ్ ఇన్ఫస్ట్రక్చర్ డెవలప్‌మెంట్
రామ్మోహన్‌రావు, లక్ష్మమ్మ : వైస్ చైర్‌పర్సన్లు, ఏపీ తెలుగు అకాడమీ
బీ సుధీర్ ప్రేమ్‌కుమార్ : ఏపీసీఐ చీఫ్ సెక్రటరీ
బండి అర్జున మనోజ్‌కుమార్: వైస్ చైర్మన్, ఏపీ మైనారిటీ కమిసన్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేసీ శర్మ: చైర్మన్, వన్ మ్యాన్ కమిషన్
రామ్మోహన్‌రావు : చైర్మన్, ఏపీ కనీస వేతన సంఘం
ఎండీ నౌమన్ : చైర్మన్, ఏపీ ఉర్దు అకాడమీ
అబ్దుల్ రహీం అఫ్సర్ : వైస్ చైర్మన్, ఏపీ ఉర్దు అకాడమీ
జియావుద్దీన్ : చైర్మన్, ఏపీ మైనారిటీ కమిషన్
కొమ్మూరి కనకరావు: ఏపీ మాదిగ కార్పొరేషన్
మధుసూదనరావు: చైర్మన్, రెల్లి కార్పరేషన్
అమ్మాజీ: చైర్మన్, ఏపీ మాల కార్పొరేషన్