నేడు హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక భేటీ

CM Jagan: ఉదయం 10-30గంటలకు అమిత్ షాను కలువనున్న జగన్

Update: 2022-12-29 03:06 GMT

నేడు హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ కీలక భేటీ

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం కలిసిన సీఎం జగన్. నేడు హోమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. వాస్తవానికి బుధవారం రాత్రి 10 గంటలకే అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో వారి భేటీ నేటికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం 10:30 గంటలకు అమిత్ షాను కలవనున్నారు సీఎం జగన్. ఈ భేటీలో విభజన హామీల అమలు, ఏపీ అభివృద్ధితో సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ఏపీలో తాజా రాజకీయాల గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్ర విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని, ప్రత్యేక హోదాతో పాటు, ప‌లు పెండింగ్ అంశాల‌ను ప‌రిష్కరించాల‌ని జగన్ కోరారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినా విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇప్పటికే చాలా వాటిని నెరవేర్చలేదని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు జగన్ విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారాయన పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2 వేల 937 కోట్ల 92 లక్షల నిధులను చెల్లించాలని కోరారు. తెలంగాణ డిస్కం నుంచి రావాల్సిన 6 వేల 886 కోట్ల బకాయిలను ఇప్పించాలని జగన్ మోడీని కోరారు.

Tags:    

Similar News